ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు

4
- Advertisement -

నిజామాబాద్ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఎన్నికల సమయంలో పైడి రాకేష్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలను వాల్ పోస్టర్ రూపంలో నిలదీశారు ఓటర్లు.

ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంతో పాటు నందిపేట్, మండల కేంద్రంలో వెలిశాయి పోస్టర్లు. పోస్టర్లలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ప్రస్తావించారు ఓటర్లు.

రూపాయికి వైద్యం ఎక్కడ?, యువతకు ఉపాధి ఎక్కడ?, నియోజకవర్గంలోని ప్రతి నిరుపేదకు ఇల్లు ఎక్కడ? అంటూ నిలదీశారు. ఆర్మూర్ నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయా అంశంగా మారింది పోస్టర్ల వ్యవహారం.

Also Read:సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు..?

- Advertisement -