సెప్టెంబర్ 17..బీజేపీకి వ్యతిరేకంగా పోస్టర్లు

31
- Advertisement -

సెప్టెంబర్ 17న బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం పేరిట సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ సభకు వ్యతిరేకంగా పరేడ్ గ్రౌండ్స్‌లో పోస్టర్లు వెలిశాయి.

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఏ విధంగా సాయపడిందో చెప్పాలని డిమాండ్ చేయాలని పోస్టర్‌లో పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమిత్ షా చెప్పుల దగ్గర పెట్టిన నాయకుడు ఎవరో చెప్పాలంటూ కొన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన నాయకులు వీళ్లేనంటూ మరికొన్ని పోస్టర్లు వెలిశాయి. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ ఏ విధంగా సహకరించారో చెప్పాలంటూ కంటోన్మెంట్ యువత పేరుతో వెలిసిన ఈ పోస్టర్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

- Advertisement -