రిలీజ్‌కు రెడీగా హీరో విజయ్ “పోస్టర్”..!

66
- Advertisement -

శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్‌పై టి మహిపాల్ రెడ్డి (TMR)దర్శకుడిగా విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం పోస్టర్. ఈ చిత్రం ఈ నెల 19న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సందర్భంగా ఈ రోజు ప్ర‌సాద్ ల్యాబ్స్ లో ప్రీ- రిలీజ్ ఈవెంట్ జ‌రిపారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ.. ప్ర‌తి సినిమాకు, ప్ర‌తి నటుడికి పోస్ట‌ర్ ఎంతో ఇంపార్టెంట్. మెహ‌బూబ‌ సినిమా టైమ్ లో నాకిష్ట‌మైన ఐమాక్స్ థియేట‌ర్ వ‌ద్ద నా సినిమా పోస్ట‌ర్ చూసి ఎంతో ఎగ్జైట్ అయ్యాను. నా పోస్ట‌ర్ ద‌గ్గ‌ర నిల‌బ‌డి సెల్ఫీ కూడా తీసుకున్నాను. అటువంటి ఒక మంచి టైటిల్ తో ఈ సినిమా వ‌స్తోంది. ట్రైల‌ర్, పాట‌లు చూశాక సినిమా చూడ‌ల‌న్న ఇంట్ర‌స్ట్ పెరిగింది. కెమెరా వ‌ర్క్, మ్యూజిక్ చాలా ఫ్రెష్‌గా ఉంది. ఈ సినిమా స‌క్సెస్ సాధించి యూనిట్ కి మంచి పేరు రావాల‌న్నారు.

న‌టుడు, ద‌ర్శ‌కుడు కాశీవిశ్వ‌నాథ్ మాట్లాడుతూ.. ప్ర‌తి సినిమా క‌ళాకారుడికి పోస్ట‌ర్ తో ఎంతో అనుబంధం ఉంటుంది. అటువంటి మంచి టైటిల్ పెట్టి మ‌హిపాల్ సినిమా తీశాడు. ప్ర‌తి ఒక్క‌రికీ క‌నెక్ట‌య్యే టైటిల్. నేను ఈ సినిమాలో మంచి పాత్ర చేశాను. ద‌ర్శ‌కుడు అన్నీ తానై ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ సినిమా చేశాడు. హీరో విజ‌య్ మంచి ప‌ర్ఫార్మెన్స్ క‌న‌బ‌రిచాడు. ఈ సినిమా స‌క్సెస్ సాధించి టీమ్ అంద‌రికీ మంచి పేరు, నిర్మాత‌ల‌కు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నా అన్నారు.

సంగీత ద‌ర్శకుడు శాండీ మాట్లాడుతూ.. మ్యూజిక్ కి స్కోపున్న సినిమా ఇది. ద‌ర్శ‌కుడ మ‌హిపాల్ పూర్తి స్వేఛ్చ‌నిచ్చి పాట‌లు చేయించుకున్నారు అన్నారు. రైట‌ర్ నివాస్ మాట్లాడుతూ.. ఈ మ‌ధ్య కాలంలో రాన‌టువంటి క‌థాంశంతో ఈ సినిమా రూపొందింది అన్నారు. నిర్మాత టి.శేఖ‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. నేను మ‌హిపాల్ రెడ్డి కోసం ఈ సినిమాలో పార్ట్ అయ్యాను అన్నారు.

ద‌ర్శ‌కుడు టి మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సినిమా పోస్ట‌ర్ న‌న్ను సినిమా రంగం వైపు ర‌ప్పించింది. సంధ్య థియేట‌ర్ లో కొంత కాలం ఆప‌రేట‌ర్ గా ప‌ని చేశాను. ఆ త‌ర్వాత డైర‌క్ష‌న్ డిపార్ట్ మెంట్ కొంత కాలం ప‌ని చేశాక‌..ఫ‌స్ట్ టైమ్ పోస్ట‌ర్ సినిమా డైర‌క్ష‌న్ చేశాను. ఒక మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కథను రాసుకొని, నిర్మాతల సహాకారంతో సినిమాను చాలా గ్రాండ్ గా తెరకెక్కించాము, ఈ సినిమా కథ “ఒక అందమైన ప్రేమకథ, ప్రతి తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ లో తన కొడుకు భవిష్యత్తు గురించి ఎంత తపన పడతాడో తెలిపే కథ, అలానే కొడుకు కి కూడా తన తండ్రి త‌ప‌న ఏంటో చెప్పే కథ, యూత్ అందరికి ఒక ఉన్నత మార్గాన్ని చూపించే కథ. క్లాస్ అండ్ మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఈ నెల 19న విడుద‌ల‌వుతోన్న మా చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా అన్నారు.

యంగ్ హీరో విజయ్ ధరణ్ మాట్లాడుతూ .. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కు ప్రాధాన్య‌త ఉంటుంది. జీరో టూ హీరో కథలు ఇంతకుముందు జనాల్ని ఆకట్టుకున్నాయి. అలాగే మా పోస్టర్ సినిమాకూడా వాస్తవానికి దగ్గరగా వున్న కథ. హీరోగా ఎస్టాబ్లిష్ అవుతున్న ఈ స్టేజ్ లో నాకు ఇలాంటి కథ దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో న‌టుడు అరుణ్‌, డాన్స్ మాస్ట‌ర్ అరుణ్‌, న‌టి మ‌ధుమ‌తి పాల్గొన్నారు. శివాజీ రాజ, మధుమణి, రామరాజు, కాశి విశ్వనాధ్, స్వప్నిక, అరుణ్ బాబు, మల్లికార్జున్, రాజేష్, రవీంద్ర, జగదిశ్వరి త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలుః నివాస్, సంగీతంః శాండీ అద్దంకి, కెమెరాః రాహుల్, ఎడిటర్ః మార్తాండ్ కె వెంకటేష్, నిర్మాతలుః టి.శేఖర్ రెడ్డి, ఏ.గంగారెడ్డి, మరియు ఐ.జి రెడ్డి. రచన–దర్శకత్వంః టి.మ‌హిపాల్ రెడ్డి (టి.యం.ఆర్)

- Advertisement -