డ్రోన్ల ద్వారా పోస్టల్‌ సేవలు..

2
- Advertisement -

మారుమూల, కొండప్రాంతాలు మరియు క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు ఉన్న ప్రాంతాలకు తపాలా సేవలను మరింత వేగవంతం చేసేందుకు ‘ఇండియా పోస్ట్’ వినూత్న అడుగు వేసింది. అసోం రాష్ట్రంలో బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ (BPO) బ్యాగుల రవాణా కోసం డ్రోన్ ద్వారా పోస్టల్ సేవలను అధికారికంగా ప్రారంభించింది. ‘స్కై ఎయిర్ మొబిలిటీ’ అనే ప్రముఖ డ్రోన్ డెలివరీ సంస్థ భాగస్వామ్యంతో ఇండియా పోస్ట్ ఈ ప్రాజెక్టును విజయవంతంగా పట్టాలెక్కించింది.

అసోంలో రవాణా సౌకర్యాలు సరిగ్గా లేని మారుమూల గ్రామాలకు ఉత్తరాలు, పార్సిళ్లు మరియు అత్యవసర పోస్టల్ సామాగ్రిని చేరవేయడానికి ఈ డ్రోన్ నెట్‌వర్క్ ఎంతో సహాయపడనుంది.ప్రాథమికంగా అసోం రాష్ట్రవ్యాప్తంగా 40 విభిన్న మార్గాల్లో (Routes) ఈ డ్రోన్ సేవల నిర్వహణ ప్రారంభమైంది.కేవలం అసోంకే పరిమితం కాకుండా, ఈశాన్య రాష్ట్రాలతో పాటు కొండప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్‌లలో కూడా కలిపి మొత్తం 150 మార్గాల్లో డ్రోన్ నెట్‌వర్క్‌ను పునాదిగా ఏర్పాటు చేస్తున్నారు.

నదులు, అడవులు, కొండ ప్రాంతాల గుండా ప్రయాణించి గంటల సమయం పట్టే దూరాలను డ్రోన్లు కేవలం కొన్ని నిమిషాల్లోనే దాటేస్తాయి.ఇండియా పోస్ట్ చేపట్టిన ఈ ఆధునిక సాంకేతిక విప్లవం ద్వారా మారుమూల ప్రాంతాల ప్రజలకు తపాళా సేవలు సులభతరం కానున్నాయి.రోడ్డు మార్గాన గంటల తరబడి సమయం పట్టే కొరియర్ రవాణా ఇప్పుడు నిమిషాల వ్యవధిలోనే పూర్తవుతుంది.

Also Read:హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు నివేదిక!

స్కై ఎయిర్ మొబిలిటీ సాంకేతికత ద్వారా ప్రతి పోస్టల్ బ్యాగ్ ప్రయాణాన్ని రియల్ టైమ్‌లో ట్రాక్ చేసే వీలుంటుంది.విశ్వసనీయత: వాతావరణం లేదా రోడ్డు పునర్నిర్మాణ సమస్యలతో సంబంధం లేకుండా నిరంతరాయంగా సేవలను అందించవచ్చు.సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కూడా ఆధునిక సేవలను చేరువ చేయడంలో ఇండియా పోస్ట్ తీసుకున్న ఈ నిర్ణయం దేశ తపాలా రంగంలో ఒక మైలురాయిగా నిలవనుంది.

- Advertisement -