- Advertisement -
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి అరుదైన గౌరవం లభించింది. తపాలా శాఖ యాదాద్రి ఆలయ ఫొటోతో పోస్టల్ కవర్ రిలీజ్ చేసింది. రాష్ట్రంలో ఈ గుర్తింపు పొందిన తొలి ఆలయం యాదాద్రి కావడం విశేషం. సోమవారం యాదాద్రి ఆలయాన్ని సందర్శించిన కేంద్ర సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ భువనగిరి పోస్ట్ ఆఫీసులో యాదాద్రి ఆలయంతో ఉన్న పోస్టల్ కవర్‌ను రిలీజ్ చేసింది.
యాదాద్రి ఆలయం ఏరియల్ వ్యూతో పాటు ఆలయానికి సంబంధించిన వివరాలతో బ్రోచర్‌ను కూడా ఈ కవర్‌పై ముద్రించారు.
ఇటీవలే యాదాద్రి ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వం పునర్నిర్మించిన సంగతి తెలిసిందే. ఆలయ రినోవేషన్ కోసం రూ.1200 కోట్లు ఖర్చు చేశారు. ఇందుకోసం 39 కిలోల బంగారం, భారీ మొత్తంలో వెండిని ఉపయోగించారు.
- Advertisement -