ఆంధ్ర రాష్ట్రంలో షూటింగ్స్ చేస్తే నిర్మాతలకు రాయితీలు ఇస్తామని చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి ప్రకటించారు. సినిమా అభివృద్ధి కోసం త్వరలో సీఎం జగన్‌తో చర్చలు జరుపబోతున్నామని అన్నారు. ఆంధ్రలో సినిమా షూటింగ్స్ చేస్తే నిర్మాతలకు భారం కాకుండా అతి తక్కువగా ఖర్చయ్యేలా చూస్తామని చెప్పారు. అలాగే నంది అవార్డ్స్ కోసం కూడా మాట్లాడడం జరుగుతుందని వివరించారు.
అలాగే చంద్రబాబు హయాంలో నంది అవార్డుల పంపకంపై చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పొసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవార్డును కులం, గ్రూపుల వారిగా పంచుకున్నారని ఆరోపించారు. టెంపర్‌లో నటనకు గానూ కర్మకాలి తనకు అవార్డు వచ్చిందని, అయితే కమ్మ అవార్డు అని వద్దనుకున్నా అని పేర్కొన్నారు. అవార్డుల జడ్జిల్లో 12 మంది ఉంటే 11 మంది కమ్మవాళ్లే ఉండేవారని పోసాని వెల్లడించారు.
మొత్తానికి పోసాని కృష్ణ మురళి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఎదిగి.. ఇప్పుడు ఆ సినిమా ఇండస్ట్రీ పైనే విమర్శలు చేస్తున్నాడు అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పోసాని కృష్ణమురళి కామెంట్స్ పై సినీ ప్రముఖులు సీరియస్ అవుతున్నారు. జగన్ మెప్పు కోసం పోసాని పిచ్చి కూతలు కూస్తున్నాడు అంటూ సీరియస్ అవుతున్నారు.
ఇవి కూడా చదవండి..