పోసాని వర్సెస్ పృథ్వీ.. తగిన శాస్త్రే!

6
- Advertisement -

పోసాని కృష్ణమురళి అరెస్టుపై X వేదికగా స్పందించారు నటుడు పృథ్వీరాజ్. నోటి దూలకి తగిన శాస్తి తప్పదు అని..నిజం ఎప్పుడూ న్యాయానికి తోడుగా నిలుస్తుందన్నారు.మాట విలువైనది చాల పొదుపుగా వాడాలి.. నిజం తెలుసుకుని ఎప్పుడు ఆగిపోవాలో తెలిసిన వాడు మహాపురుషుడు అంటూ పృథ్వీ పోస్ట్ చేశారు.

రాయదుర్గంలోని మైహోం భుజ అపార్ట్‌మెంట్‌లో పోసానిని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో క్రైమ్ నంబర్ 65/2025 అండర్ సెక్షన్ 196, 353(2),111 రెడ్ విత్ 3(5) బీఎన్ఎస్ యాక్ట్ 2033 నాన్ బెయిలబుల్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు పోసాని.

Also Read:నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్..

- Advertisement -