కాపుల జీవితాలను నాశనం చేసిన చిరు!

24
- Advertisement -

కాపుల జీవితాలను చిరంజీవి నాశనం చేశారని ఆరోపించారు సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమరుళి. ఏపీలో మీడియాతో మాట్లాడిన పోసాని…చిరంజీవికి ప్రజలంటే లెక్కలేదని మండిపడ్డా పోసాని…సినిమాల్లాగే రాజకీయాలకు బిజినెస్ చేశారని ఆరోపించారు.

కూటమి నేతలకు మద్దతిస్తూ చిరంజీవి మాట్లాడటాన్ని తప్పుబట్టిన పోసాని..చిరును నమ్మి కాపులు జీవితాలు నాశనం చేసుకున్నారు అని దుయ్యబట్టారు. చిరంజీవిని నమ్మి చాలా మంది కాపులు జీవితాలు నాశనం చేసుకున్నారని…. ప్రజాసేవ అంటూ పార్టీ పెట్టి మూసేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 18మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి అమ్మేశాడని దుయ్యబట్టారు. రాజకీయాలు వద్దని సినిమాల్లోకి వెళ్లి ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు.

చంద్రబాబు అండ్ కో కి పేదలు అభివృద్ధి చెందడం ఇష్టం లేదని.. బాబు 14ఏళ్ల పాలనలో ఏం సంపద సృష్టించాడో చెప్పాలన్నారు. అర్బన్ ఓటర్లు గ్రామాల్లో పేద కుటుంబాల్లో జరిగిన అభివృద్ధిని గమనించాలని కోరారు.

Also Read:జగన్‌ లేవనెత్తిన ప్రశ్నలకు..సమాధానం చెప్పగలరా?

- Advertisement -