పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ మాజీ ప్రియురాలు.. అని కత్తి మహేష్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పవన్‌పై కత్తి మహేష్ కామెంట్ చేసిన సందర్బంలో ఓ ట్వీట్ చేసి వార్తల్లో నిలిచింది పూనమ్ కౌర్. ఇప్పుడు మళ్ళీ వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది పూనమ్.
తాజాగా ఈ అమ్మడు పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఇప్పుడు ఆమె పెట్టిన పోస్ట్ పరోక్షంగా పవన్ ని విమర్శించినట్టుగా ఎందని పూనమ్ పై మండిపడుతున్నారు పవన్ ఫ్యాన్స్. అయితే పవన్‌ను ఉద్దేశించే ఆమె అలాంటి పోస్ట్ పెట్టిందా.. లేక మరెవరి గురించో అలాంటి పోస్ట్ పెట్టిందా అనే డౌట్స్ కూడా మొదలయ్యాయి.
ఇంతకీ పూనమ్ ఎలాంటి పోస్ట్ పెట్టిందంటే.. ‘‘కాన్సెప్ట్ కాపీ చేసి… డైలాగ్స్ కాపీ చేసి.. బట్టలు మార్చుకున్నట్టు.. మనసులు మారుస్తూ.. మాట మీద ఉండకపోవడం.. జనాల అమాయకత్వంతో ఆడుకుంటూ.. వేషభాషలు మారుస్తూ జనాలను మభ్య పెట్టి.. అమ్మాయిలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు కొంత మంది.. ఆ భగవంతుడే నిజం ఏంటనేది తెలియజెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’.అని పోస్ట్ చేసింది.
అయితే పవన్ సభ జరిగిన మరుసటి రోజే పోస్ట్ పెట్టడంతో కచ్చితంగా ఆయన గురించేనంటున్న వారూ లేకపోలేదు. పూనం ఎవరిని ఉద్దేశించి పోస్ట్ పెట్టిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఇండైరెక్ట్‌గా పవన్‌పై అటాక్ చేసిందని కూడా టాక్. మరి పూనం ఉద్దేశమేంటో.. ఎవరిని ఇలా విమర్శించిందో తెలియాల్సి ఉంది.