సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో నటి పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ను ఉద్దేశించి ఆమె చేసిన పోస్టులు సంచలనంగా మారాయి. స్త్రీలను హింసించి, వారికి తీవ్ర మానసిక క్షోభను మిగిల్చి, ఆ తర్వాత ఏమీ తెలియనట్లు సమాజంలో తిరిగే వ్యక్తులు నిజంగా దుర్మార్గులని పూనమ్ కౌర్ తీవ్రంగా వ్యాఖ్యానించారు.
ఇలాంటి వ్యక్తులకు మీడియా మద్దతు ఇవ్వడం, అలాగే బాధ్యతను ప్రశ్నించని ‘మా’ (MAA) అసోసియేషన్ వంటి సంస్థల వ్యవహారమే మహిళలపై వేధింపులు కొనసాగడానికి కారణమని ఆమె ఆరోపించారు. ఒక చిన్న వ్యాఖ్యను పెద్దగా హైలైట్ చేసే మీడియా, ఇంత పెద్ద అన్యాయాలు జరుగుతున్నప్పుడు మాత్రం మౌనం వహించడం బాధాకరమని ఆమె అన్నారు.
మహిళల సమస్యలపై మాట్లాడే సమయంలో సెలెక్టివ్ అప్రోచ్ తీసుకోవడం వల్లే వేధింపులకు గురైన వారు న్యాయం పొందలేకపోతున్నారని పూనమ్ కౌర్ పేర్కొన్నారు. ప్రభావవంతమైన వ్యక్తుల విషయంలో ప్రశ్నించకుండా వదిలేయడం సమాజానికి మంచిది కాదని స్పష్టం చేశారు.
తన వ్యాఖ్యలు ఎవరికైనా నచ్చకపోయినా, నిజాన్ని బయట పెట్టడం కోసం మాట్లాడుతున్నానని పూనమ్ కౌర్ తెలిపారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా స్పందించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమతో పాటు సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.
Also Read:అధిక బరువుతో కిడ్నీలకు ఎఫెక్ట్!

