త్రివిక్రమ్‌పై పూనమ్ సంచలన కామెంట్స్!

19
- Advertisement -

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై సంచలన కామెంట్స్ చేశారు నటి పూనమ్ కౌర్. తెలుగు యూట్యూబ‌ర్ ప్ర‌ణీత్ హ‌నుమంతు చిన్న పిల్ల‌ల విష‌యంలో, అమ్మాయిల విష‌యంలో సెక్స్‌వ‌ల్ కామెంట్స్ చేయగా పోలీసులు అత‌డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై స్పందించిన పూనమ్‌..పనిలో పనిగా త్రివిక్రమ్‌ పై ఘాటు విమర్శలు చేశారు. జల్సా సినిమాలో ఓ డైలాగ్‌ను చెబుతూ.. ప‌డుకోని ఉన్న అమ్మాయిని రేప్ చేస్తే ఆనందం ఏముంటుంది.. పరిగెత్తించి పరిగెత్తించి చేయాలి అనే డైలాగ్ ఉంటుంది.. త్రివిక్రమ్ నుంచి ఇంతకన్నా మంచి డైలాగ్స్ ఆశించడం తప్పే అవుతుంది అని తెలిపింది.

త్రివిక్రమ్‌ ఎలాంటి వాడో, ఆయన చెడు స్వభావం ఎంటో నాకు తెలుసు. మగవారి ఇగో కోసం ఆయన సపోర్ట్‌ చేస్తారని కూడా తెలుసు అని ఆరోపించింది. ఇతరుల జీవితాలను త్రివిక్రమ్‌ నాశనం చేస్తారు అని ఆరోపించింది పూనమ్.

Also Read:బండి సంజయ్‌కు కేటీఆర్ బహిరంగలేఖ

- Advertisement -