దేశంలో పేరుకుపోయిన నల్లధనాన్ని..నకిలీ నోట్ల దందాను అరికట్టేందుకు ప్రధాని మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఇక నుంచి 500 రూపాయల నోట్లు…వెయ్యి రూపాయలు చిత్తుకాగితాలతో సమానమని సంచనల ప్రకటన చేశాడు. దీంతో జనాలంతా పాత నోట్లను మార్పించుకునేందుకు బ్యాంకులకు,,పోస్టాఫీస్‌లకు బారులు తీరారు. కొంత మంది నల్లడబ్బు మహారాజులేమో ఇక చేసేది లేక వాటిని తగలబెట్టడం,,చెత్తకుప్పలో వేయడం..చింపి నీటిలో వేయడం చేస్తున్నారు. రద్దైన పాత నోట్లతో జనాలంతా ఇక్కట్లు పడుతుంటే..ఓ మహిళ మాత్రం పాత నోట్లను చాలా చక్కగా వాడేసుకుంటోంది. చిత్తు కాగితాలుగా మారిన పాత నోట్లను ఇలా కూడా ఉపయోగించుకోవచ్చంటు తోటి మహిళలకు ఓ చిన్న హింట్ ఇచ్చింది.
కవితకు కాదేది అనర్షం అన్నట్టు,,అలంకరణకు కాదేది అనర్షం అంటూ నిరూపించింది ఈ మహిళ. చెల్లని..చిత్తు కాగితాలుగా మారిన పెద్ద నోట్లతో తన వాలు జడను చక్కగా అలంకరించుకుంది. పులకొప్పుకు బదులు,,ఇలా నోట్ల కొప్పుతో దర్శణమిచ్చింది. పూల జడ చూశాం..గంటల జడ చూశాం..ఈ నోట్లజడ ఏంటబ్బా అంటూ అందరు ముక్కున వేసుకుంటున్నారు. డిఫెరెంట్‌గా ట్రై చేసిన ఈ మహిళ ఇప్పుడు సోషల్ మీడియాలోహాట్ టాపిక్ గా మారిపోయింది. నోట్లజటగా సోషల్ మీడియా హాల్ చల్ చేస్తోంది. పాత నోట్లను మార్పిడి చేసుకునేందుకు,,జనాలంతా బ్యాంకులకు పరుగుతీస్తుంటే…ఈ మహిళ మాత్రం రద్దైన నోట్లతో జటను ఆలంకరించుకుంటూ తన ముచ్చటను తీర్చుకుంది. చల్లని నోట్ల ఏమైన వాడేసుకుందా అంటూ.. లైక్ల మీద లైక్స్ కొట్టేస్తున్నారు.