తల్లైన స్వామి రారా బ్యూటీ!

36
- Advertisement -

స్వామిరారా సినిమాతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ పూజా రామచంద్రన్. ఈ సినిమా సక్సెస్‌తో తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు దక్కించుకుంది. ఓ వైపు సినిమాల్లో ఉండగానే 2019లో జాన్ కొక్కెన్ అనే నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

తర్వాత సినిమాలకు దూరమైన పూజా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా ఫొటోలు షేర్ చేస్తూనే ఉంది. కొన్ని నెలల క్రితం పూజా తాను ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇటీవలే తన భర్త జాన్ కొక్కెన్ తో కలిసి సముద్రపు ఒడ్డున బేబీ బంప్ ఫోటోషూట్ కూడా చేసింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజాగా శనివారం ఏప్రిల్ 29న రాత్రి తమకు బాబు పుట్టాడని పూజా – జాన్ దంపతులు తెలిపారు. హాస్పిటల్ బెడ్ మీద నుంచే పూజా, జాన్ తమ బాబు చేయిని పట్టుకున్న ఓ ఫోటోని పోస్ట్ చేసి.. ఇదిగో మా చిన్ని బాబు వచ్చేశాడు. దీంతో అభిమానులు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.

- Advertisement -