పెద్ద నోట్ల రద్దుతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా నల్లకుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మోదీ తీసుకున్నఈ నిర్ణయంతో ఇన్నాళ్లు బీరువాలకే పరిమితమైన నల్లధనం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. పన్నులు చెల్లించకుండా,,అక్రమంగా సంపాదించుకున్న చాలా మంది ఆ డబ్బు మార్చుకునే పరిస్థితి లేకపోవటంతో కాల్చేయటం..పారేయటం లాంటివి చేస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున నల్లడబ్బు వేస్ట్ అవుతుంది. ఎవరికీ ఉపయోగంలేకుండా అవుతోంది. అయితే ఈ పరిణామాలపై హీరోయిన్ పూజా హెగ్డే ప్రధాని మోదీకి సలహా ఇచ్చింది.
నల్లధనాన్ని అలా కాల్చిపారేడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి ‘2017 మార్చి వరకు పాత 500, 1000 రూపాయల నోట్లను ప్రభుత్వ హాస్పటల్స్‌కు డొనేషన్ గా ఇచ్చే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలా చేస్తే నల్లధనం ఓ మంచి పనికి ఉపయోగించే అవకాశం కలుగుతుంది. ఎలాంటి ఉపయోగం లేకుండా పడేయటం కన్నా..పేద ప్రజల ఆరోగ్యానికి ఉపయోగిస్తే బాగుందని తెలియజేసింది. వారి ప్రాణాలకు ఆర్యోగ భద్రత పెరుగుతుంది’. అంటూ ట్వీట్ చేసింది. ఇప్పటికే పెద్ద ఎత్తున నల్లడబ్బు తగులబెడుతున్న వార్తలు, చెత్త కుండీల దగ్గర పడేస్తున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ముకుంద హీరోయిన్ పూజ సలహాకు మంచి స్పందన వస్తోంది. నల్లధనాన్ని హాస్పిటల్స్ కు డొనేట్ చేయడం వల్ల కొంత వరకైనా సమాజానికి ఉపయోగపడుతుందని,,ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.