రౌడీ స్టార్‌తో పూజా రొమాన్స్‌!

109
vijay
- Advertisement -

అనతికాలంలోనే టాలీవుడ్‌లో అగ్రశ్రేణీ హీరోయిన్ల జాబితాలో చోటుదక్కించుకుంది పూజా హెగ్డే. టాలీవుడ్, కోలీవుడ్ ఏ ఇండస్ట్రీ అయినా సినిమాలు చేసుకుంటూ పోతున్న పూజా..తాజాగాబాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో ‘కభీ ఈద్ కభీ దివాలీ’ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతోంది.

ఒకవైపు చేతిలో సినిమాలు ఉండగానే మరోవైపు మరిన్ని సినిమాలకు ఓకే చెప్పేసింది. త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోయే సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు ఇప్పటికే వార్తలు వస్తుండగా . ఈ సినిమాతో పాటు పవర్ స్టార్ పవన్‌తో సినిమాకు ఓకే చెప్పిన పూజా.. తాజాగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో సినిమాకు చెప్పేసింది.

పూరి -విజయ్‌ కాంబోలో వస్తున్న జనగణమన అనే మరో ప్రాజెక్టు కూడా పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజాను సెలెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో పూజా రొమాంటిక్ ట్రాక్ ఓ రేంజ్‌లో ఉంటుందని, ఇందులో బోల్డ్ సీన్స్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -