కోటిన్నర ఇస్తే.. ఒప్పుకుంటా..

314
Pooja Hegde offered Rs 1 Cr
- Advertisement -

తెలుగులో ‘ఒక లైలా కోసం’, ‘ముకుందా’ సినిమాలు చేసిన పూజా హెగ్డే ఆ తరువాత ‘మొహంజోదారో’ సినిమా కోసం బాలీవుడ్ వెళ్లింది. ఆ సినిమా ఆశించినస్థాయి విజయాన్ని సాధించకపోవడంతో, తిరిగి టాలీవుడ్ పై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే పూజా హెగ్దే‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో ఛాన్స్‌ కొట్టేసింది.

 Pooja Hegde offered Rs 1 Cr

పూజా … నటిగా ప్రతిభావంతురాలే కానీ… సరైన హిట్సేమీ లేవు . ఈ కన్నడ అమ్మాయి తెలుగులో రెండు మూడు సినిమాలతో గుర్తింపును సంపాదించుకుంది కానీ, విజయాలను కాదు. అదే సమయంలో బాలీవుడ్ లో ఒకటీఅర ప్రయత్నాలు చేసినా అవీ అంతగా కలిసి రాలేదు.

అయితే పూజా కెరీర్ ఎక్కడా ఆగడం లేదు. వరస పెట్టి అవకాశాలు లభిస్తూనే ఉన్నాయి. మరి అలా లక్కీగా దూసుకుపోతున్న పూజ పారితోషకం విషయంలో కూడా ఒక రేంజ్ కు వెళ్లిందని సమాచారం.

  Pooja Hegde offered Rs 1 Cr

ప్రస్తుతం పూజ పారితోషకంగా కోటిన్నర రూపాయల స్థాయికి వెళ్లిందనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ‘డీజే’ తర్వాతి సినిమాలకు ఈమె ఈ రేటు చెబుతోందట. ఇంకా డీజే విడుదల కాలేదు. కానీ పారితోషకాన్ని మాత్రం భారీగా పెంచేసిందట పూజ.

ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఉంది. ఈ పరిస్థితిని క్యాష్ చేసుకుంటోంది పూజ. కోటిన్నర అడుగుతున్నా ఈమెను హీరోయిన్ గా తీసుకోవడానికి కొందరు హీరోలు ఆసక్తితోనే ఉన్నారు. మరి డీజే సినిమా గనుక హిట్ అయితే పూజ ఇంకెంత అడుగుతుందో!

- Advertisement -