సుశాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఆగస్ట్ 27న సినిమా విడుదలవుతుంది. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించిన ఈ సినిమా నుంచి శుక్రవారం రోజున ‘నీ వల్లే నీ వల్లే..’ అనే సాంగ్‌ను ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే విడుదల చేసింది. ‘నీ వల్లే నీ వల్లే..’ సాంగ్ చాలా అహ్లాదంగా ఉంటూ ఆకట్టుకునే రొమాంటిక్ సాంగ్. ఈ పాట.. తన ప్రేయసితో సమయం గడపటానికి అవకాశం వచ్చిన ప్పుడు హీరో సుశాంత్ ఎంత ఆనందంగా ఫీల్ అవుతున్నాడో తెలియజేసేలా ఉంది. పాటలో సుశాంత్ హ్యండ్సమ్గా, కూల్‌గా కనిపిస్తున్నాడు.
ఇక సుశాంత్ లవర్‌గా నటించిన మీనాక్షి చౌదరి పాటలో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పాటలో మంచి బీట్స్ ఉన్నాయి. దానికి తగినట్లు ఆనందంతో సుశాంత్ చేసే డాన్స్‌ను కూడా పాటలో చూడొచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు పర్ఫెక్ట్ సిట్యువేషన్ సాంగ్‌ను అందించారు. శ్రీనివాస్ మౌళి రాసిన ఈ పాటను సంజిత్ హెగ్డే పాడారు. చక్కటి ఈ కాంబినేషన్‌తో పాట నెక్ట్స్ లెవల్‌కు చేరుకుంది.
ఎస్.దర్శన్ దర్శకత్వంలో నిజ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. రీసెంట్గా విడుదలైన ఈ సినిమా టీజర్‌కు చాలా మంచి స్పందన వచ్చింది.సుశాంత్ జోడీగా మీనాక్షి చౌదరి నటించగా, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అభినవ్ గౌతమ్ తదితరులు ఇతర ప్రధాన ప్రాతల్లో ప్రేక్షకులకు నవ్వులను పంచనున్నారు.ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్‌పై రవి శంకర్ శాస్త్రి, ఎక్తా శాస్త్రి, హరీశ్ కోయల గుండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశారు.
నటీనటులు:సుశాంత్, మీనాక్షి చౌదరి, వెంకట్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం, ఐశ్వర్య, నిఖిల్ కైలాస, కృష్ణచైతన్య తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: ఎస్.దర్శన్
నిర్మాతలు: రవి శంకర్ శాస్త్రి, ఎక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల
నిర్మాణ సంస్థలు: ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్
సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్
మ్యూజిక్: ప్రవీణ్ లక్కరాజు
ఎడిటర్: గ్యారీ బి.హెచ్
డైలాగ్స్: సురేశ్ భాస్కర్
ఆర్ట్: వి.వి
పి.ఆర్.ఓ: వంశీ శేఖర్