డీఎస్పీ మ్యూజిక్ కి.. 83ఏళ్ల యంగ్ బామ్మ స్టెప్పులు..!

276
- Advertisement -

83ఏళ్ల ఓ బామ్మకి…దేవిశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌ ఉత్సాహాన్ని తెప్పించింది. డీఎస్పీ ఇచ్చిన మ్యూజిక్‌ని వినగానే స్టెప్పులతో అదరగొట్టింది.

ఆ 83ఏళ్ళ బామ్మ ఎవరో కాదు హాట్‌ బ్యూటీ పూజహెగ్దే వాళ్ళ అమ్మమ్మ. గత రెండురోజులుగా అనారోగ్యంతో హాస్పటల్లో ఉందట ఈ బామ్మ. అయితే పూజ హెగ్ధే ‘రంగస్థలం’ మూవీలో ‘జిగేలు రాణి’ అనే స్పెషల్ సాంగ్ చేసి ఆకట్టుకుంది. అయితే ఆ సాంగ్‌ ప్రోమోని వాళ్ళ అమ్మమ్మకు చూపించేసరికి తన అమ్మమ్మ లేచి డాన్స్ చేసిందంటూ ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది పూజ.

Pooja hegde grand mother dance

‘‘మా అమ్మమ్మ రెండు రోజులుగా హాస్పిటల్‌లోనే ఉంది. నా జిగేలురాణి ప్రోమో చూసిన వెంటనే తనకు చాలా సంతోషం వేసి డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. అది ఆమెకు చాలా ఎనర్జీనిచ్చింది. 83ఏళ్ల యంగ్.. డీఎస్పీ మ్యూజిక్ విని తను పాడకుండా ఉండలేకపోయింది’’ అంటూ పూజ ట్వీట్ చేసింది. దీనికి ‘సో స్వీట్!! ఆమె నిజంగా 83 ఏళ్ల యంగ్’ అంటూ రకూల్‌ ట్వీట్ చేసింది. ఇప్పుడు ఆ బామ్మ డాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మరోవైపు ఇలా అమ్మమ్మ అనారోగ్యంతో ఉన్న సందర్బాన్ని కూడా సినిమా ప్రమోషన్ కోసం ఇలా వాడుకోవడమేంటని కొంతమంది నెటిజన్లు పూజపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే..రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్‌ డైరెక్షన్లో తెరకెక్కిన ‘రంగస్థలం’ ఇటీవలే సెన్సార్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం ప్రమోషన్‌లో పరంగా దూసుకుపోతోంది.

https://www.youtube.com/watch?v=o6Ul3bcIG7U

- Advertisement -