విద్యార్థి దశలోనే ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు అందుబాటులోకి తీసుకొచ్చాం అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రోడ్డు ప్రమాదాల నివారణ విద్యార్థి దశ నుంచే అలవర్చుకోవాలి అన్నారు.
గతంలో రోడ్డు భద్రత అవగాహన పై వారోత్సవాలు ఉండేవి ఇప్పుడు వాటి స్థానంలో రోడ్ భద్రత మాసోత్సవాలు తీసుకొచ్చాం…రవాణా శాఖ లో కొత్తగా , స్క్రాప్ పాలసీ, ఈవీ పాలసీ తీసుకొచ్చాం అన్నారు.
విద్యార్థులు మీరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, మీ తల్లదండ్రులు పాటించేలా అవగాహన కల్పించండన్నారు. డిపీస్ స్కూల్ లో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ఏర్పాటు కు సహకరించిన స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్పారు. పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి స్క్రాప్ పాలసీ తెచ్చాం అని… రోడ్ సేఫ్టీ పై విద్యార్థి దశ లో నే ట్రాఫిక్ అవగాహన కల్పించేందుకు పాఠ్య పుస్తకంలో ట్రాఫిక్ అవేర్నెస్ పై ఒక పాఠంగా చేర్చేందుకు ప్రణాళికలు చేస్తున్నాం అన్నారు.
Also Read:రీవెంజ్ పాలిటిక్స్ మంచిది కాదు: జగ్గారెడ్డి

