ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం

13
- Advertisement -

ఎన్నికల్లో గెలుపోటములు సహజం అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రంజాన్ గిఫ్ట్ ఇచ్చానంటూ మాట్లాడుతున్న బండి సంజయ్ వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనలేమి కి నిదర్శనంగా ఉన్నాయి అన్నారు. దమ్ముంటే బిజెపి నేతలు కేంద్రం నుంచి వచ్చే నిధులు పనులు తీసుకురావాలి .. రామగుండం నుంచి హైదరాబాద్ వరకు ఎయిట్ లైన్ రహదారి నిర్మాణం చేపట్టాలి అన్నారు.

ఇదంతా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు… కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అన్నారు. హైదరాబాద్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. గతంలో టూరిజం ఆర్కియాలజీ మినిస్టర్ గా ఉండి హైదరాబాద్ కు చేసింది ఏంటి అని ప్రశ్నిస్తున్న? అన్నారు. రాష్ట్రం పట్ల బీజేపీ ఇప్పటికే వివక్ష చూపుతూనే ఉందని.. తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో బిజెపి ఎంపీలు ఎందుకు కృషి చేయడం లేదు అని ప్రశ్నించారు.

Also Read:ఓటీటీలో డాకు మహారాజ్.. హవా!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తక్కువ తేడాతో ఓటమి పాలయ్యాము.. ఓటమిపై సమీక్షించుకుంటాము .. ఈ ఓటమి భవిష్యత్ పై ఎలాంటి ప్రభావం చూపించదు అని చెప్పారు పొన్నం.

- Advertisement -