బీసీ ప్రజాప్రతినిధులతో పొన్నం భేటీ

24
- Advertisement -

అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మేల్యేల తో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సమావేశం అయ్యారు. సమావేశంలో ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, బిర్ల ఐలయ్య,ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, ప్రకాష్ గౌడ్ ,ఈర్లపల్లి శంకరయ్య ,మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తదితరులు హాజరయ్యారు.

నేడు శాసన సభలో బీసీ లకు స్థానిక సంస్థల్లో ,విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ బిల్లు ప్రవేశపెట్టనుండడంతో బిల్లు సజావుగా అన్ని పార్టీల మద్దతు ఇచ్చేలా మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నారు.

దేశంలో మొదటి సారి చారిత్రాత్మక బీసీ రిజర్వేషన్లు పెంచుతూ బిల్లు ఆమోదం పొందిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క,ఇతర మంత్రులతో కలిసి జాతీయ స్థాయిలో ఇతర పార్టీల నేతలను కలిసి రిజర్వేషన్ల పెంపు మద్దతు కోరాలని సమావేశంలో చర్చ జరిపారు.

Also Read:KTR:20న సూర్యాపేటలో.. 23న కరీంనగర్‌లో బీఆర్ఎస్ సమావేశం

- Advertisement -