జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే అది తెలంగాణ ప్రజలను అవమానించినట్టేనని ఆయన అన్నారు. గతంలో పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ మనోభావాలను గాయపరిచాయని, అందుకే ఆయనను ఎప్పటికీ తెలంగాణ వ్యతిరేకిగా చూస్తామని స్పష్టం చేశారు.
కొండగట్టు అభివృద్ధికి పవన్‌కల్యాణ్ ఏం చేసినా, తెలంగాణ పట్ల ఆయన వైఖరిలో మార్పు రాదని పొన్నం అన్నారు. కోనసీమలో కొబ్బరిచెట్లు ఎండిపోవడానికి తెలంగాణ దిష్టి తగిలిందని పవన్ చులకనగా మాట్లాడారని గుర్తు చేశారు. అలాంటి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను అవమానించినట్లేనని మండిపడ్డారు.
ఇలాంటి నేపథ్యంతో పవన్‌కల్యాణ్‌తో బీజేపీ ఎలా పొత్తు పెట్టుకుంటుందో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ గౌరవం, ఆత్మగౌరవంపై రాజీ పడే నాయకుడిగా పవన్‌కల్యాణ్‌ను ఎప్పటికీ అంగీకరించబోమని పొన్నం ప్రభాకర్ గౌడ్ స్పష్టం చేశారు.
Also Read:Harishrao:రేవంత్ స్కామ్ క్యాలెండర్ విడుదల

