దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠ పెరుగుతుందో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన సోనియా గాంధీ,రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ప్రజా సమస్యల పై పోరాటం చేస్తున్నప్పుడు బీజేపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది అని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాను ఉద్దేశించి ప్రసంగించారు పొన్నం.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని వేధింపులకు గురి చేయడం ద్వారా ఆధైర్యపరిచే ప్రయత్నం చేస్తుంది.. నరేంద్ర మోదీ,అమిత్ షా కాంగ్రెస్ పార్టీ చరిత్ర దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించి దేశ ఐక్యత సమగ్రత కోసం ఏ విధంగా పాటు పడ్డారో తెలిసిన ప్రతి భారత పౌరుడు గాంధీ కుటుంబానికి అండగా ఉంటున్నారు అన్నారు. గాంధీ కుటుంబం ఈ దేశం కోసం అనేక రకాల త్యాగాలు చేసింది.. ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండి ఒకవేళ అవినీతి కి పాల్పడి ఉంటే వాళ్లు ఎక్కడ ఉంటుందే నరేంద్ర మోడీ 10 సంవత్సరాలుగా భారత దేశ ఆస్తి ఆధాని అంబానీ కి అప్పగిస్తుంటే దానిని వ్యతిరేకించే రాహుల్ గాంధీ పై మోదీ కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అన్నారు.
Also Read:తక్కువ అంచనా వేయకండి…కాంగ్రెస్ ఎమ్మెల్యే
ప్రజాస్వామ్యం రాజ్యాంగాన్ని గౌరవించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది అన్నారు. మీరు మాకు నేర్పే అవసరం లేదు…మేము విచారణకు అడ్డుకుంటలేము విచారణకు మా నాయకులు హాజరవుతున్నారు… మీరు చేస్తున్న వేధింపులు దేశ ప్రజలకు చెప్పడానికి ధర్నాలు జరుగుతున్నాయి అన్నారు. మోడీ జోడి ఈడి మోడీ బీజేపీ అనుబంధ సంస్థలుగా పని చేస్తున్నాయి… వారి మిత్రపక్షాలు ఎంత అవినీతి చేసిన చర్యలు ఉండవు, అనేక అవినీతికారులు బీజేపీ లో కలుస్తూ ప్రియాంక గాంధీ చెప్పినట్టు వాషింగ్ మెషీన్ లో వేసినట్టు పునీతులు అవుతున్నారు… బీజేపీ చేస్తున్న రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా గాంధీ కుటుంబానికి తెలంగాణ కాంగ్రెస్ అండగా ఉంటుంది అన్నారు.

