లక్ష్మణ్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు: పొన్నం

13
- Advertisement -

నేను అడ్లూరి లక్ష్మణ్ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో చూసి అడ్లూరి తప్పుగా అనుకున్నట్లు ఉన్నారు అన్నారు.

ఈ విషయంపై అడ్లూరితో మాట్లాడేందుకు ట్రై చేశాను కానీ అందుబాటులోకి రాలేదు అన్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ తప్ప ఇంకేం లేదు…. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కూడా మాట్లాడాను అని తెలిపారు.

మరోవైపు ఈ విషయంపై మల్లికార్జున ఖర్గేకు, మీనాక్షికి లేఖ రాశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. రేపటి వరకు సమయమిస్తున్నా.. పొన్నం క్షమాపణలు చెప్పాలి… దీనిపై పొన్నం మాట మారిస్తే తర్వాత జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి అన్నారు. తాను మాదిగ జాతిలో పుట్టి మంత్రి అవ్వడమే తప్పా?..త్వరలో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేను కలుస్తాను అని చెప్పారు.

Also Read:ఆదివాసీల ఆరాధ్య దైవం..కొమురం భీం

- Advertisement -