పొన్నాల లక్ష్మయ్య.. కంటతడి

37
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. తన రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడిన పొన్నాల కన్నీటి పర్యంతం అయ్యారు. పేద కుటుంబం నుండి వచ్చి నాసాలో పనిచేసి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. పార్టీలో చర్చించేందుకు అవకాశామివ్వలేదని చెప్పారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఏడు రిజర్వాయర్లు నిర్మించానని తెలిపారు.

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానని 12 సంవత్సరాలు మంత్రిగా పనిచేశానని తెలిపారు. అయినా పార్టీలో అవమానాలు, అవహేళనలు జరిగాయన్నారు. కొంతమంది తీరుతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని చెప్పారు. బీసీలకు సీట్లు అడిగితే పట్టించుకోని పరిస్థితి ఉందని…ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పేద కుటుంబం నుండి ప్రజల కోసమే పనిచేశానని చెప్పారు.

బీసీ నాయకుడికి అవమానాలు జరుగుతుంటే ఎవరు పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నందుకు గర్వపడేవాడిని కానీ ఇప్పుడు బాధపడే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. పార్టీ కార్యాలయం ముందు నిరసన తెలిపే హక్కు కూడా బీసీలకు లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటమికి నన్ను బాధ్యుడిని చేయడం సరికాదన్నారు.

Also Read:కాంగ్రెస్ పార్టీకి పొన్నాల రాజీనామా..

- Advertisement -