రేవంత్ కు పొంగులేటి ఎఫెక్ట్ ?

31
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ లో ఉండే ఆధిపత్య విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ పదవి చేపట్టిన తరువాత ఈ ఆదిపత్య విభేదాలు తారస్థాయికి చేరుతూ వచ్చాయి. రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలపై సీనియర్ నేతల నుంచి సానుకూలత లేకపోవడం, రేవంత్ రెడ్డి కూడా సీనియర్ నేతలను పూర్తిగా పక్కన పట్టి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ రావడం వంటి పరిణామాలతో టి కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు గట్టిగానే సాగుతూ వచ్చింది. ఒకానొక టైమ్ లో రేవంత్ రెడ్డిని టీపీసీసీ పదవి నుంచి తొలగించాలని పార్టీలోని సీనియర్ నేతలు గట్టిగానే తిరుగుబాటు చేశారు. అయితే అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డిని తప్పించేందుకు ససేమిరా అంటూ వచ్చింది..

అయితే కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తరువాత టి కాంగ్రెస్ లో ఆధిపత్య విభేదాలు కొంత సద్దుమణిగినట్లే కనిపిస్తున్నాయి. పైపైకి తామంతా ఒక్కటే అని చెబుతున్నప్పటికి కాంగ్రెస్ లోని చాలమంది సీనియర్ నేతలు ఇప్పటికీ రేవంత్ నాయకత్వంపై గుర్రుగానే ఉన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ గూటిక చేరారు ఆయన పార్టీలో చేరగానే కీలకమైన ప్రచార కమిటీ కొ చైర్మెన్ బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ హైమకండ్. దీంతో పొంగులేటి స్థానం కాంగ్రెస్ లో ఒక్కసారిగా పెరిగింది.

ఖమ్మంలో పొంగులేటికి ప్రజాధరణ బలంగా ఉండడంతో పాటు రేవంత్ రెడ్డి మాదిరిగానే దూకుడుగా చురుకైనా మాటలతో పొంగులేటి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇటు కాంగ్రెస్ లోని అందరినేతలతో కూడా పొంగులేటికి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ టీపీసీసీ అధ్యక్ష పదవి మార్పు జరిగితే నెక్స్ట్ ఆప్షన్ గా పొంగులేటి ఉండే అవకాశం ఉందని కొందరి అభిప్రాయం. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆదిపత్య విభేదాలు అనగా సీనియర్స్ వర్సస్ రేవంత్ రెడ్డి రాజకీయం మళ్ళీ తెరపైకి వస్తే.. అధ్యక్ష మార్పు ప్రస్తావనకు వచ్చే అవకాశం లేకపోలేదు. అలా చూస్తే అధ్యక్ష పదవి విషయంలో రేవంత్ రెడ్డికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నుంచి పోటీ తప్పదనేది కొందరు చెబుతున్నా మాట.

Also Read:డెబిట్ కార్డ్ తో పని లేకుండా..డబ్బు విత్ డ్రా!

- Advertisement -