BRS:పొంగులేటి,జూపల్లి సస్పెండ్

26
- Advertisement -

పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిపై వేటు వేశారు బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్. కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులపై వేటు వేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. వీరిద్దరిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

దీంతో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఖమ్మం నుండి వైసీపీ తరపున ఎంపీగా గెలిచారు పొంగులేటి. తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఓడించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఇక జూపల్లి సైతం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడగా వీరిద్దరిపై తాజాగా సస్పెన్షన్ వేటు పడింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -