గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ఈ రెండు రాష్ట్రాల్లో స్పష్టమెన మెజారిటీతో తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
తీవ్ర ఉత్కంఠ నడుమ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విస్పష్ట ఆధిక్యం కనబరిచిన బీజేపీలో ఉత్సాహం నెలకొంది. బీజేపీ ఊహించినట్లుగానే మెజార్టీకి కంటే అధికంగా సీట్లలో దూసుకెళ్తుంది.అధిక్యం అటూ ఇటూ ఉన్నా.. 100 సీట్లలో స్పష్టమైన మెజార్టీ సాధించే దిశగా దూసుకెళుతోంది. మెజార్టీకి కావాల్సిన మేజిక్ ఫిగర్ 92 దాటేసింది.
అటు పార్లమెంట్‌కు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ చిరునవ్వులు చిందిస్తూ విక్టరీ సింబల్ ప్రదర్శించారు. గుజరాత్,హిమాచల్‌లో పార్టీ విజయం పట్ల ప్రధాని మోదీని పలువురు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు అభినందించారు.
ఇదిలా ఉండగా గుజరాత్ లో బీజేపీ మేజిక్ ఫిగర్ ను దాటడంతో బీజేపీ పార్టీ నేతలు ఆనందోత్సహాలతో సంబరాలు జరుపుకుంటున్నారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం దగ్గర సంబురాలు అంబరాన్ని అంటాయి.