- Advertisement -
దేశ వ్యాప్తంగా మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటలకు ముగిసింది. 5గంటల వరకూ క్యూలైన్లలో నిలుచున్న వారికే అవకాశం ఇవ్వనున్నారు. ఒక్క నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మాత్రం సాయంత్రం 6గంటలకు పోలింగ్ ముగియనుంది. ఎండ తీవ్రత తగ్గడంతో సాయంత్రం ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివస్తున్నారు ఓటర్లు.
అలాగే 13అసెంబ్లీ సెగ్మెంట్ లలో సాయంత్రం 4గంటలకే పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 3గంటల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 48.95శాతం పోలింగ్ నమోదైనట్లు ప్రకటించారు ఎన్నికల అధికారులు. నాగాలాండ్‌లో అత్యధికంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 68 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. తెలంగాణలో మధ్యాహ్నాం 3గంటల వరకూ అత్యధికంగా మెదక్ జిల్లాలో 62.63శాతం ఓటింగ్ నమోదైంది.
- Advertisement -