పీకే అంటే బండి బ్యాచ్‌కు ఎందుకంత వణుకు..?

85
- Advertisement -

తెలంగాణలో రాజకీయ సమీకరణాలను శరవేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం కేంద్రంలో నిరంకుశ మోదీకి ఢీ కొట్టే నాయకుడు కనిపించని టైమ్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఉత్తుంగ తరంగంలా దూసుకువచ్చారు. ఖబడ్దార్ మోదీ…ఢిల్లీ కోట గోడలు బద్ధలు కొడతా అంటూ…సీఎం కేసీఆర్ చేసిన సింహగర్జన ఉత్తరాది ప్రజలను సైతం ఆకట్టుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ సన్నహాలు ఆరంభించారు. ఈ క్రమంలో ముంబై పర్యటనలో ప్రధాని మోదీ హిందూత్వ విధానాలను తీవ్రంగా ఎండగడుతున్న విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌కు పెద్ద పీట వేయడం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. ప్రకాశ్‌రాజ్ సీఎం కేసీఆర్‌కు మద్దతు పలకడంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ జీర్ణించుకోలేకపోతున్నాడు. తుకుడే తుకుడే గ్యాంగ్‌కు మద్దతిచ్చే ప్రకాశ్ రాజ్‌కు తన పర్యటనలో ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని బండి డిమాండ్ చేశాడు.

ఇక కేంద్రంలో మోదీని, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌తో ప్రముఖ రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్‌ కలిసి పని చేయబోతున్న సంగతి తెలిసిందే. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో పీకే సేవలను వినియోగించుకోవాలని, అలాగే రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఆయన సలహాలు, సూచనలు అవసరమని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా దేశంలోనే ఫేమస్ పొలిటికల్ స్ట్రాటిజిస్ట్ ప్రశాంత్ కిశోర్ సీఎం కేసీఆర్‌తో పని చేయడంపై కాషాయ నేతల్లో కంగారు మొదలైంది. పీకే సత్తా ఏంటో కాషాయనేతలకు బాగా తెలుసు…ముఖ్యంగా 2014లో ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ అధికారంలోకి రావడానికి.. పీకే వ్యూహాలే కారణం. తనదైన వ్యూహాలతో రెండు స్థానాల్లో ఉన్న బీజేపీని.. అధికారంలోకి తీసుకు వచ్చాడు. ఆ తర్వాత బీహార్ లో నితీష్ కుమార్, తమిళనాడు రాష్ట్రంలో స్టాలిన్ కు, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీకి, ఒడిశాలో నవీన్ పట్నాయక్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డికి పీకే పని చేశారు.

అయితే.. వచ్చే ఏడాది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో… ప్రశాంత్ కిషోర్ టిఆర్ఎస్ పార్టీకి వ్యూహకర్తగా పని చేస్తారని గత కొంతకాలం నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పీకేపై బీజేపీ నేత తీన్మార్ మల్లన్న ఒక సంచలన ట్వీట్ చేశాడు. రీసెంట్‌గా నటుడు ప్రకాష్ రాజ్‌తో కలిసి గజ్వేల్‌లో మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ పరీశీలనకు వెళ్లిన ప్రశాంత్ కిశోర్‌ ఫోటోను మల్లన్న ట్విట్టర్‌లో షేర్ చేశాడు. టీఆర్ఎస్ పార్టీకి రాజకీయ కర్తగా ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నాడు అనే సంకేతం వచ్చేలా తీన్మార్ మల్లన్న ట్వీట్ చేశాడు. అయితే మల్లన్న పోస్టుపై నెట్‌జన్లు ఫుల్లుగా రియాక్ట్ అవుతున్నారు. ప్రశాంత్ కిషోర్ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పని చేస్తే మీ బీజేపీ నేతలకు ఎందుకంత భయం…పీకే సత్తా తెలుసుకనుకే నీకు ప్యాంట్ తడిచిపోతుందా అంటూ నెట్‌జన్లు తీన్మార్ మల్లన్న‌పై సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం పీకేపై తీన్మార్ మల్లన్న చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -