చంద్రబాబు ఇంటికి భద్రత పెంపు?

11
- Advertisement -

వైసీపీని చిత్తుచేసి టీడీపీ కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 12న నాలుగోసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే చంద్రబాబుకు భద్రతను పెంచగా తాజాగా చంద్రబాబు ఇంటివద్ద భద్రతను భారీగా పెంచారు.

చంద్రబాబును కలిసేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొంతమంది అధికారులు అక్కడ అంతా హడావిడి వాతావరణం నెలకొంది. చంద్రబాబును కలిసే వారి సంఖ్య పెరిగిపోతుండటంతో భద్రతను పెంచారు పోలీసులు.

ఏపీలో అధికారంలోకి రావడమే కాదు కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌లో కీలకంగా మారింది టీడీపీ. ఇక టీడీపీకి నాలుగు లేదా ఐదు కేంద్రమంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read:బీహార్‌కు ప్రత్యేక హోదా తేవాలి:తేజస్వి

- Advertisement -