ఎమ్మార్వో హత్య కేసు.. అందుకే చంపా..

466
- Advertisement -

నిన్న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ అధికారిణి విజయా రెడ్డిని దారుణ హత్య అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘనటపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఘటనను మంత్రులు, పలువురు నేతలు,ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిచారు. ఈ ఘనటపై విచారణ వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్‌ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక హత్యకు గరైన విజయారెడ్డి అంత్యక్రియలు ఈ రోజు నాగోల్‌లోని స్మశాన వాటికలో జరగనున్నాయి. కాగా అమెను కాపాడబోయి గాయాలపలైన ఆమె డ్రైవర్‌ గురునాథం కూడా మంగళవారం మరణించాడు.

mro vijaya reddy

అయితే ఈ ఘటనలో తహసీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్‌ పోసి సజీవ దహనం చేసిన కూర సురేష్‌ అతనిపై కూడా పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో సురేష్‌కు సైతం తీవ్ర గాయాలు అయిన సంగతి తెలిసిందే. సురేష్‌ ఉస్మానియా ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నాడు. శరీరంపై దాదాపు 70 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన సురేశ్, కోమాలోకి వెళ్లడంతో, మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మరో రెండు రోజుల తరువాతనే సురేశ్ ఆరోగ్యంపై ఓ అంచనాకు రావచ్చని తెలిపారు. కాగా, ఈ కేసు విచారణలో భాగంగా సురేష్‌ను పోలీసులు ఇప్పటికే ప్రశ్నించారు.

suresh statement

అయితే పోలీసుల విచారణలో తాను ఎందుకు విజయారెడ్డిని హత్య చేశాడో వివరించాడు. తన భూమికి పట్టా ఇవ్వకుండా ఎమ్మార్వో విజయారెడ్డి తిప్పుతున్నారన్న కోపంతోనే.. ఆమెపై దాడి చేసి హత్య చేశానని సురేష్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. తన భూమికి పట్టా కోసం చాలాకాలంగా తహసీల్దారు విజయారెడ్డి చుట్టూ తిరుగుతూ ఉన్నానని, కానీ పట్టా ఇచ్చేందుకు ఆమె నిరాకరించారని సురేశ్ తన స్టేట్ మెంట్ లో స్పష్టం చేశాడు. ప్రస్తుతం సురేష్ హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడ్ని విచారించిన పోలీసులు.. హత్యకు దారితీసిన గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మేజిస్ట్రేట్ ను తీసుకుని వెళ్లి, సురేశ్ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు.

- Advertisement -