- Advertisement -
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే చెక్ బౌన్స్ కేసులో ముంబై అంధేరి కోర్టు వర్మకు మూడు నెలల జైలు శిక్ష విధించగా తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు ఒంగోలు పోలీసులు.
ఫిబ్రవరి 4న విచారణకి హాజరు కావాలని ఒంగోలు పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. రామ్ గోపాల్ వర్మ వాట్సప్‌కి నోటీసు పంపారు రూరల్ సీఐ శ్రీకాంత్.సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు వర్మ .
ఈ నేపథ్యంలో గతేడాది నవంబర్ 10న వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. నవంబర్ 19, 25 తేదీల్లో రెండు సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకి హాజరు కాకుండా కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్లారు.
Also Read:వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర
- Advertisement -

