- Advertisement -
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు జారీ చేశారు పోలీసులు. నోటీసుల నేపథ్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణ కు హాజరు కానున్నారు బన్నీ.
నోటీసుల అనంతరం తన లీగల్ టీమ్‌తో భేటీ అయ్యారు అల్లు అర్జున్. విచారణకు హాజరవ్వాలా..? సమయం కోరాలా..? అనే విషయంపై లీగల్ టీమ్‌తో చర్చలు జరిపారు. సంధ్య థియేటర్ ఘటనపై ఇప్పటికే రూపొందించిన ఒక వీడియో ఆధారంగా అల్లు అర్జున్‌ను ప్రశ్నించే అవకాశం ఉంది.
మరోవైపు అల్లు అర్జున్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. అల్లు అర్జున్ ఎపిసోడ్‌లో ఎవరూ మాట్లాడొద్దని…మీడియా సమావేశాలు, చర్చల్లో అల్లు ఎపిసోడ్‌పై మాట్లాడొద్దని రేవంత్ రెడ్డి సూచించారు. అలాగే పార్టీ నాయకులు కూడా మాట్లాడకుండా చూడాలని పీసీసీకి ఆదేశాలు జారీ చేశారు.
Also Read:ప్రజాకవి కాళోజీ..బయోపిక్ రిలీజ్ డేట్!
- Advertisement -