ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారం చౌర్యం కేసులో తెలంగాణ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏపీలో ఉన్నట్టు భావిస్తున్న ఐటీగ్రిడ్ ఎండీ అశోక్‌ను చట్టబద్ధంగా హైదరాబాద్‌కు తెచ్చేందుకు పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ఐటీ గ్రిడ్ చైర్మన్ అశోక్ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడంతో పాటు దేశం విడిచి పారిపోకుండా ఎల్‌వోసీ జారీ చేశారు.
డేటా చోరీ వ్యవహారంలో మాదాపూర్ ఐటీ గ్రిడ్స్ కంపెనీలో విస్తృతంగా సోదాలు నిర్వహించిన పోలీసులు పలు రికార్డులు,ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన సమాచారం డేటా గ్రిడ్స్ సంస్థకు ఎలా చేరిందనే అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఐటీగ్రిడ్ సంస్థ కంప్యూటర్లలో డిలీట్ అయినట్టు భావిస్తున్న సమాచారం రికవరీపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. దాదాపు 80 జీబీ పరిమాణంలోని సమాచారాన్ని రికవరీ చేసినట్టు తెలుస్తున్నది. ఇందుకోసం తెలంగాణ పోలీసులు అమెజాన్ వెబ్‌సర్వీస్ సంస్థతోపాటు గూగుల్ ప్లేస్టోర్స్ సహకారాన్ని కోరారు.
రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం,ఓటర్ల జాబితా ప్రైవేటు కంపెనీలో ఉండటంపై వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఐటీ గ్రిడ్స్ సంస్థపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇక మరోవైపు సేవామిత్ర యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి ఎంతమంది డౌన్‌లోడ్ చేసుకున్నారు? అందులోకి అప్‌లోడ్‌చేసిన సమాచారం, దానిని ఎవరెవరు వినియోగిస్తున్నారు? వంటి వివరాలు కోరుతూ సైబరాబాద్ పోలీసులు గూగుల్ ప్లే సోర్ట్స్,అమెజాన్ వెబ్ సర్వీస్ సంస్థలకు లేఖరాశారు. ఈ రెండు సంస్థల నుంచి సమాచారం అందిన తర్వాత దర్యాప్తును మరింత వేగవంతం చేయనున్నారు.