బెదిరింపు కాల్స్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మంగళ్ హాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 1+4 భద్రతను సద్వినియోగం చేసుకొని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వాడుకోవాలని సూచించారు పోలీసులు.
గోషామహల్ లో చిన్న చిన్న గల్లీల్లో బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో ప్రజల్లోకి వెళ్లలేనని రాజాసింగ్ చెప్పారు. తన గన్ లైసెన్స్ దరఖాస్తు చాలా రోజులుగా పెండింగ్ లో ఉందని తన గన్ కు లైసెన్స్ ఇవ్వాలని పోలీసులను కోరారు ఎమ్మెల్యే రాజాసింగ్.
రాజాసింగ్‌కు గత నెల 25న బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజు కాకపోతే రేపైనా నీ తల నరికేస్తామని ఆగంతకులు తనన బెదిరించినట్లు రాజాసింగ్ తెలిపారు. రెండు గుర్తుతెలియని ఫోన్ నంబర్ల నుంచి బెదిరింపులు వచ్చాయని చెప్పారు. గతంలోనూ ఆయనకు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు నిందితులను గర్తించి పట్టుకున్నారు. రాజాసింగ్ హత్యకు కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది.
Also Read:ఆరు గ్యారెంటీలు..గోవిందా: కేటీఆర్