చిక్కుల్లో రాజ్ తరుణ్‌?

20
- Advertisement -

అసలే ఫ్లాప్‌లు ఆపై చిక్కుల్లో పడ్డారు హీరో రాజ్ తరుణ్. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజ్ తరుణ్ మోసం చేశాడని లావణ్య అనే యువతి నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 11 ఏళ్లుగా తాను, రాజ్ తరుణ్ రిలేషన్‌లో గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నామని తన ఫిర్యాదులో పేర్కొంది.

ఓ హీరోయిన్‌తో అఫైర్ పెట్టుకుని తనను వదిలేశాడని ఆరోపించింది. తనను చంపేస్తానని బెదిరిస్తున్నారని… అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని ఫిర్యాదులో పేర్కొంది. రాజ్ తరుణ్ తన నుండి మూడు నెలలుగా దూరంగా ఉంటున్నారని పేర్కొంది.

మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ రిలేషన్‌లో ఉన్నాడని అందుకే మాల్వీ మయాంక్‌ తనను బెదిరించారని లావణ్య ఫిర్యాదు చేసింది. రాజ్‌తరుణ్‌ జీవితంలోంచి వెళ్లిపోకపోతే చంపుతామంటూ వాళ్లిద్దరూ బెదిరించారని నార్సింగి పోలీసులకు రాసిన ఫిర్యాదులో లావణ్య తెలిపింది. ప్రస్తుతం రాజ్ తరుణ్ నటించిన తిరగబడరసామీ త్వరలో రిలీజ్ కానుండగా ఇందులో హీరోయిన్ మాల్వీ మల్హోత్రా. కొంతకాలంగా ఫ్లాప్‌లతో సతమతమవుతున్న రాజ్‌తరుణ్‌ ఇప్పుడు మరింత చిక్కుల్లో పడ్డారు.

Also Read:KTR:విద్యార్థుల అరెస్ట్ అప్రజాస్వామికం

- Advertisement -