భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది. నల్గొండ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో 506 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదుచేశారు. పీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ తనయుడు సుహాస్ ఫిర్యాదు మేరకు కోమటిరెడ్డిపై కేసు నమోదైంది.తనను చంపుతానంటూ కోమటిరెడ్డి ఫోన్‌లో బెదిరించారని..ఆయన నుండి తనకు ప్రాణహానీ ఉందని సుహాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీపై కేసు నమోదుచేశారు పోలీసులు.
ఇక ఆదివారం చెరుకు సుహాస్‌కు ఫోన్ చేసిన కోమటిరెడ్డి బండబూతులు తిట్టారు. కౌన్సిలర్‌గా గెలవనోడు నన్ను విమర్శిస్తాడా? 25 ఏండ్ల నా రాజకీయ జీవితంలో లక్షల మందిని బతికించిన. వారిలో చాలామంది ఇప్పటికే వాడి మీద కోపంతో చంపుతామంటూ బయల్దేరారు. నిన్ను కూడా చంపేస్తరు. నీ హాస్పిటల్ ఉండదు. వారంలో వాడిని చంపేస్తారు అని కోమటిరెడ్డి బెదిరించిన ఆడియో కాల్ వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి తీరుపై సర్వత్రా విమర్శలు రాగా నిన్న ఆయన వివరణ సైతం ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..