రేవంత్ ఫిర్యాదు…అస్సాం సీఎంపై కేసు నమోదు

59
assam
- Advertisement -

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హేమంత అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్‌లలో ఆయనపై ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో అస్సాం సీఎంపై కేసు నమోదైంది. మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

ఫిబ్రవరి 11 న అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ.. మహిళా లోకాన్ని కించపరిచేలా మాట్లాడారన్నారు. ఎన్నికల ప్రచారంలో అసభ్యకరంగా కామెంట్స్ చేశాడని మండిపడ్డారు రేవంత్. ఈ వ్యవహారంపై సీఎం కేసీఆర్ కూడా సీరియస్ గా స్పందించిన సంగతి తెలిసిందే.

- Advertisement -