జగన్‌పై కేసు..ఎందుకో తెలుసా?

5
- Advertisement -

సింగయ్య మృతి కేసులో .. మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. సింగయ్య భార్య చీలి లూర్ధు మేరీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 106(1) BNS సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

ఈ ఘటనకు సంబంధించి పలు వీడియో ఫూటేజీలు, సీసీ ఫూటేజీలు, డ్రోన్ వీడియోలు, అక్కడకు వచ్చిన ప్రత్యక్ష సాక్షులను విచారించి, దీనికి సంబంధించి పలు సాంకేతిక ఆధారాలతో కూడిన సాక్ష్యాలను సేకరించి, ఆ ప్రదేశంలో లభించిన ఇతర ఆధారాలను పరిశీలించి, వాటికి వర్తించే సెక్షన్లను 105 మరియు 49 BNSలకు మార్చారు పోలీసులు.

ఈ ఘటన జరిగిన సమయంలో కారులో ప్రయాణించిన, రమణా రెడ్డి (కారు డ్రైవర్), వైయస్ జగన్, కే.నాగేశ్వర్ రెడ్డి (జగన్ పీఏ), వైవి సుబ్బారెడ్డి (మాజీ ఎంపీ), పేర్ని నాని (మాజీ ఎమ్మెల్యే), విడదల రజిని (మాజీ మంత్రి) మొదలగు వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Also Read:‘ది 100’… రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -