ఆర్జీవీ అంటేనే వివాదాలకు కేరాఫ్. అయితే కథ లేకపోతే టైటిల్…ఒక్కోసారి ఈ రెండింటింతో పాటు ట్విట్టర్‌లో ట్విట్లు వెరసీ తన సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ తెచ్చుకునే వర్మ తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్‌తో కావాల్సినంత పబ్లిసిటీ పొందాడు.
తాజాగా దీపావళి కానుకగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్‌ని విడుదల చేశారు వర్మ. ట్రైలర్‌లో జగన్, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, కేఏ పాల్‌ను పోలిన పాత్రలతో రచ్చ చేశాడు. ఏపీలో టీడీపీ ఓటమి తర్వాత జరిగిన పరిణామాలు ,జగన్ అధికారంలోకి రావడం వంటి పరిణామాల నేపథ్యంలో తెరకెక్కిన ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటోంది.
ఇక ఈ ట్రైలర్ కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉందంటూ నేతలు ఆరోపిస్తున్నారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా టైటిల్‌ను రద్దు చేయాలని అనంతపురం కాంగ్రెస్ నేతలు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో సినిమాకు అనుకున్నంత ప్రచారం సాధించాడు ఆర్జీవీ.