రణ్‌వీర్ సింగ్‌పై కేసు నమోదు

3
- Advertisement -

బాలీవుడ్ ప్రముఖ నటుడు రణ్‌వీర్ సింగ్‌పై కేసు నమోదు కావడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కన్నడలో భారీ విజయాన్ని సాధించిన ‘కాంతార’ చిత్రంలోని ఓ సన్నివేశాన్ని అనుకరించి హిందువుల మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలతో ఆయనపై ఈ కేసు నమోదైంది. ఈ వ్యవహారంపై బెంగళూరుకు చెందిన న్యాయవాది ప్రశాంత్ మెథల్ గతేడాది డిసెంబర్‌లో బెంగళూరు కోర్టును ఆశ్రయించారు.

రణ్‌వీర్ సింగ్ చేసిన అనుకరణ హిందూ సంప్రదాయాలు, ఆచారాలను అవమానించేలా ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఆదేశాల మేరకు బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. రణ్‌వీర్ సింగ్‌పై భారత న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 196, 299 మరియు 302 కింద కేసు బుక్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా, ఈ వివాదం తలెత్తిన సమయంలోనే రణ్‌వీర్ సింగ్ ఇప్పటికే క్షమాపణలు కూడా కోరిన విషయం తెలిసిందే. ఎవరి మనోభావాలను గాయపరిచే ఉద్దేశం తనకు లేదని, తన చర్యల వల్ల బాధ కలిగితే హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. తాజా కేసు నమోదు నేపథ్యంలో ఈ అంశంపై మరింత న్యాయపరమైన చర్చ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read:దుకాణాల్లో హైడ్రా రంగనాథ్ తనిఖీలు

- Advertisement -