మాజీమంత్రి పేర్నినానిపై చిలకలపూడి పీఎస్ లో కేసు నమోదు అయింది. పేర్ని నానితో పాటు మరో 29 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు పోలీసులు.
ఆర్. పేట సీఐ ఏసుబాబుపై దౌర్జన్యం చేశారని కేసు నమోదు చేశారు పోలీసులు. అసలేం జరిగిందంటే మచిలీపట్నం టౌన్ పీఎస్‌కు వెళ్లారు నాని. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదం జరుగగా కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై స్పందించారు నాని. మా పార్టీ నాయకుడి కోసమే నేను స్టేషన్‌కు వెళ్లా… మేకల సుబ్బన్నను ఎందుకు తీసుకొచ్చారని సీఐని అడిగా , మీకు చెప్పాల్సిన అవసరం లేదు.. మేం ఎవరినైనా తీసుకురావొచ్చని సీఐ చెప్పారు… పోలీసు ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని కక్షసాధింపు చేస్తే ప్రశ్నిస్తే తప్పేంటి చెప్పాలన్నారు.
సీఐ ఇష్టానుసారంగా మాట్లాడితే ఆత్మగౌరవాన్ని చంపుకుని బ్రతకలేం… కృష్ణాజిల్లా ఎస్పీ పూర్తి వాస్తవాలు తెలుసుకోవాలి.. పోలీస్ స్టేషన్ లో సిసి ఫుటేజ్ చూసి మాట్లాడాలి అన్నారు నాని.
Also Read:ఆరి దర్శకుడికి కేంద్రమంత్రి ప్రశంసలు

