మోహన్ బాబుపై కేసు నమోదు

2
- Advertisement -

జల్‌పల్లిలోని తన నివాసం వద్ద జర్నలిస్టులపై దాడి చేసిన నటుడు మోహన్ బాబుపై పహాడి షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మోహన్ బాబుపై 118 BNS సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

ఇవాళ ఉదయం 10.30 గంటలకు మోహన్ బాబు, మనోజ్, విష్ణులకు విచారణకు రావాలని ఆదేశించారు రాచకొండ సీపీ. మోహన్ బాబు బౌన్సర్ల బైండోవర్‌కు ఆదేశించారు. మోహన్ బాబుతో పాటు విష్ణు దగ్గర ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించారు.

నిన్న రాత్రి మోహన్ బాబు చేసిన దాడిలో జర్నలిస్టుకు దవడ పైభాగంలో మూడు చోట్ల ఎముక విరిగినట్లుగా సమాచారం. దాడిలో అతని ఎముక విరిగిందని, సర్జరీ చేయాలంటున్న డాక్టర్లు వెల్లడించారు. మోహన్ బాబు దగ్గర సమాధానం లేకపోతే సైలెంట్‌గా వెళ్లిపోవాలి అంతేగానీ ఇలా దాడి చేయడం కరెక్ట్ కాదు అన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. జర్నలిస్టు సమాజానికి మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read:మరింత ముదరిన మంచు ఫ్యామిలీ వివాదం!

- Advertisement -