మాజీ మంత్రి జోగి రమేష్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదైంది. జగన్ పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ రవి వర్మ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల ఫిర్యాదు ప్రకారం, జగన్ పర్యటన సమయంలో జోగి రమేష్ బైక్ ర్యాలీ నిర్వహించి, పెద్ద ఎత్తున జన సమీకరణకు ప్రోత్సహించారని ఆరోపించారు. ఈ చర్యల వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిందని, పబ్లిక్ న్యూసెన్స్‌కు కారణమయ్యారని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు, అనుమతి లేకుండా రోడ్లు బ్లాక్ చేయడంతో ట్రాఫిక్ స్తంభించి సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read:Funky:‘ఫంకీ’ ట్రైలర్ అప్‌డేట్
సున్నిత ప్రాంతాల్లో రెచ్చగొట్టేలా వ్యవహరించి, శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు కూడా జోగి రమేష్‌పై మోపబడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయనపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

