న‌టి కస్తూరిపై చెన్నైలో కేసు న‌మోదు

0
- Advertisement -

వివాదాస్పద కామెంట్స్ చేసి తరచూ వార్తల్లో నిలిచే త‌మిళ సీనియర్ న‌టి కస్తూరిపై చెన్నైలో కేసు న‌మోదు అయ్యింది. బీజేపీ కార్య‌క‌ర్త అయిన‌ కస్తూరి తెలుగు ప్ర‌జ‌ల‌ గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయగా దీనిపై చెన్నైలోని ఎగ్మోర్ పోలీస్ స్టేషన్‌లో కేసు న‌మోదు అయ్యింది. త‌మిళ‌నాడులోని తెలుగు ప్ర‌జ‌లు ఈ పిటిష‌న్ ఇవ్వ‌గా.. ఫిర్యాదును స్వీక‌రించిన పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

తమిళనాడులో 300 ఏండ్ల క్రితం రాజుల కాలంలో అంత:పురం మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వాళ్లే తెలుగువారని.. అలా వచ్చినవారు ఇప్పుడు తమది తమిళ జాతి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడింది.

అయితే తన కామెంట్స్‌పై వెనక్కి తగ్గింది. నా వ్యాఖ్యలు మీ మనసును బాధపెట్టి ఉంటే క్షమించండి. నేను మాట్లాడిన మాటలు పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నాను అని పేర్కొనగా ఆమెపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదుచేశారు.

Also Read:Rahul:దేశంలో ఇంకా కుల వివక్ష ఉంది

- Advertisement -