నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటాచలం ఎంపీడీవో సరళ కేసు విషయంలో పోలీసులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఈ ఉదయం అరెస్టు చేసి తీసుకెళ్లారు.కోటంరెడ్డి తన ఇంటిపైకి వచ్చి దౌర్జన్యం చేశారని, దాడి చేసేందుకూ ప్రయత్నించారని నిన్న సరళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ జరిపి, కోటంరెడ్డి దాడి చేశారనడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని తేల్చారు.
ఆపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.వైద్య పరీక్షల తర్వాత ఆయన్ని నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. వ్యక్తిగత విషయాల్ని కొందరు రాజకీయం చేస్తున్నారన్న కోటంరెడ్డి… తాను ఏ తప్పూ చెయ్యలేదని అన్నారు. విచారణలో నిజాలు బయటికొస్తాయని అన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో జీవీఆర్ కృష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డిల లేఔట్ కు వాటర్ కనెక్షన్ ఇచ్చే విషయమై ఎంపీడీవో, కోటంరెడ్డి మధ్య వివాదం తలెత్తిందన్న సంగతి తెలిసిందే.

