ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు.. అంటూ థియేటర్లలో ప్రిన్స్ మహేశ్ బాబు చేసిన రచ్చను ఎవరైనా మర్చిపోతారా. అలాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ చిత్రం పోకిరి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకువచ్చింది. సినిమా విడుదలై సుమారుగా 16 సంవత్సరాలైనప్పటికీ మరోకసారి రిలీజ్ కాగా దాని కోసం కేటాయించిన టికెట్లు కేవలం ఒక్క గంటలోనే అమ్ముడయ్యి రికార్డు సృష్టించింది.
మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి మహేష్ కి సూపర్ స్టార్ డం తెచ్చిపెట్టింది. అప్పట్లోనే 80 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా 4కె వెర్షన్ లో ఆగష్టు 9వ తేదీన సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ రీ రిలీజ్ చేయనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోనే కాక వేరే రాష్ట్రాలు, వేరే దేశాల్లో కూడా తెలుగు వాళ్ళు ఉన్నచోట పోకిరి సినిమాని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ పెట్టగా అన్ని చోట్ల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఏపీలో 60 థియేటర్స్, తెలంగాణలో 42 థియేటర్స్‌లో, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మరో 33 స్క్రీన్స్‌లో విడుదల చేస్తున్నారు.