ఆర్సీబీ బౌలర్ యాష్ దయాళ్‌పై పోక్సో కేసు నమోదు అయింది. క్రికెట్ కెరీర్‌లో సలహాలు ఇస్తానని నమ్మించి సీతాపురలో ఓ హోటల్‌కి పిలిచి, తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది రాజస్థాన్‌కు చెందిన యువతి.
ఆ తర్వాత తనను బ్లాక్‌మెయిల్ చేసి రెండేళ్ల పాటు తనపై యాష్ దయాళ్ పలుమార్లు అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి. లైంగిక వేధింపులు మొదలైనప్పుడు యువతి వయస్సు 17 సంవత్సరాలు ఉండటంతో యాష్ దయాళ్‌పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.
ఇటీవలే తనను పెళ్లి చేసుకుంటానని ఇంట్లో పరిచయం చేసి యాష్ దయాళ్ మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో యువతి.5 ఏళ్లు కలిసి ఉండగా తనను శారీరకంగా, మానసికంగా హింసించి, తర్వాత వేరే అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకున్నాడని ఆరోపించింది ఉత్తరప్రదేశ్ యువతి.దీనిపై ఇప్పటికే కోర్టుకు వెళ్లి తనను అరెస్ట్ చేయొద్దని స్టే తెచ్చుకున్నాడు యాష్ దయాళ్.
Also Read:కింగ్డమ్ టికెట్ ధరల పెంపు

