సంక్షేమ రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శం..

248
Pocharam
- Advertisement -

ఈ రోజు ప్రమాణస్వీకారం చేసిన పాలక వర్గానికి నా శుభాకాంక్షలు, అభినందనలు అని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.జిల్లా ప్రజా పరిషత్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పరిపాలన సౌలభ్యం కోసం, ప్రజల వద్దకే ప్రభుత్వం వెళ్లాలని కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది.రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లో కొత్త పాలక వర్గాలు ఈ రోజు ప్రమాణస్వీకారం చేస్తున్నాయి.

కామారెడ్డి కొత్త జిల్లాకు మొదటి జడ్పీ చైర్మన్‌గా శోభ పేరు శాశ్వతంగా మిగిలిపోతుంది .ప్రజల చేత ఎన్నుకోబడిన జిల్లా స్థాయిలోనే అతున్నత సభలో కూర్చున్నారు.కామారెడ్డి ప్రజల అభీష్టం మేరకు జిల్లా సభ పనిచేయాలి.తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది.జిల్లా ప్రగతి కోసం అందరూ కలిసి పనిచేసి జిల్లా ప్రగతికి పాటుపడాలని పోచారం తెలిపారు.

అలాగే నిజామాబాద్ జిల్లాలో ఈ రోజు ప్రమాణస్వీకారం చేసిన పాలక వర్గానికి రాష్ట్ర రోడ్డు, భావనల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన సభలో మాట్లాడుతూ.. కొత్త జిల్లాలో మొదటి జడ్పీ చైర్మన్ గా చరిత్రలో నిలిచిపోతుంది.జిల్లా అభివృద్దిలో నా వంతు సహకారం అందిస్తానని అన్నారు.ప్రజా జీవితంలో మంచి పేరు తెచ్చుకుని, ప్రజల కష్టాలు తీర్చే విధంగా పని చేసి మరిన్ని పదవులు తెచ్చుకోవాలని నూతన పాలకవర్గాన్ని అభినందించారు.

- Advertisement -